అనుబంధం

సమస్యా పరిష్కారం


పనిచేయని సిస్టమ్‌ను నివేదించేముందు, కింది పట్టికను చూడండి మరియు మీరు సమస్యను గుర్తించి పరిష్కరించగలరో లేదో చూడండి. సమస్య ఇంకా ఉంటే లేదా మీ నిర్దిష్ట అవసరాన్ని మీరు గుర్తించలేకపోతే, మీరు కొనుగోలు చేసిన ప్రదేశంలో లేదా డీలర్‌ను సంప్రదించండి.

ధ్వని మరియు డిస్‌ప్లే

లక్షణం
జరగటానికి అవకాశమున్న కారణం
పరిష్కారం
శబ్దం లేదు
సిస్టమ్ ఆఫ్ చేయబడింది
  • ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్ “ACC” లేదా “ON” కి సెట్ చేయబడిందని నిర్ధారించుకోండి.
  • సిస్టమ్‌ను ఆన్ చేయడానికి పవర్ బటన్‌ను నొక్కండి.
తక్కువ వాల్యూమ్ స్థాయి
వాల్యూమ్‌ని సర్దుబాటు చేయడానికి కంట్రోల్ ప్యానెల్‌లో వాల్యూమ్ నాబ్‌ను తిప్పండి.
సిస్టమ్ మ్యూట్ చేయబడింది
సిస్టమ్‌ను అన్‌మ్యూట్ చేయడానికి స్టీరింగ్ వీల్‌పై మ్యూట్ బటన్‌ను నొక్కండి.
ఒక స్పీకర్ నుండి మాత్రమే ధ్వని వినబడుతుంది.
అసమతుల్య ధ్వని అవుట్‌పుట్
అన్ని మెనూలు స్క్రీన్ పై, సెట్టింగ్‌లు > సౌండ్ నొక్కండి మరియు మీరు ధ్వని ఎక్కడ నుండి రావాలనుకుంటున్నారో ఎంచుకోండి.
శబ్దం రావటం లేదు లేదా పాడైన శబ్దం వస్తోంది.
సిస్టమ్ వైబ్రేషన్
ఇది లోపం కాదు. సిస్టమ్ వైబ్రేట్ అయినట్లయితే, శబ్దం రాకపోవచ్చు లేదా పాడైన శబ్దం రావచ్చు. వైబ్రేషన్ ఆగిపోయినప్పుడు, సిస్టమ్ సాధారణంగా పనిచేస్తుంది.
చిత్రం నాణ్యత బాగాలేదు.
సిస్టమ్ వైబ్రేషన్
ఇది లోపం కాదు. సిస్టమ్ వైబ్రేట్ అయినట్లయితే, చిత్రం సరిగా రాకపోవచ్చు. వైబ్రేషన్ ఆగిపోయినప్పుడు, సిస్టమ్ సాధారణంగా పనిచేస్తుంది.
చాలాకాలమైన లేదా పాడైపోయిన స్క్రీన్
సమస్య కొనసాగుతూ ఉంటే, మీరు కొనుగోలు చేసిన ప్రదేశంలో లేదా డీలర్‌ను సంప్రదించండి.
స్క్రీన్‌పై చిన్న ఎరుపు, నీలం లేదా ఆకుపచ్చ చుక్కలు కనిపిస్తున్నాయి.
LCD చాలా ఎక్కువ పిక్సెల్ సాంద్రత అవసరమయ్యే సాంకేతికతతో తయారు చేయబడినందున, మొత్తం పిక్సెల్‌లలో 0.01 % కంటే తక్కువ అనుమతించబడిన పరిధిలో పిక్సెల్ లోపం లేదా స్థిరమైన లైటింగ్ సంభవించవచ్చు.

USB ప్లేబ్యాక్

లక్షణం
జరగటానికి అవకాశమున్న కారణం
పరిష్కారం
USB స్టోరేజ్ డివైజ్ లోని ఫైల్‌లు గుర్తించబడలేదు.
ఫైల్ ఫార్మాట్ అనుకూలంగా లేదు
USB పరికరానికి అనుకూల మీడియా ఫైల్‌లను కాపీ చేసి, పరికరాన్ని మళ్లీ కనెక్ట్ చేయండి. > USB మోడ్”ను చూడండి.
సరికాని కనెక్షన్
USB పోర్ట్ నుండి USB స్టోరేజ్ డివైజ్ డిస్‌కనెక్ట్ చేసి, దాన్ని సరిగ్గా మళ్లీ కనెక్ట్ చేయండి.
పాడైపోయిన USB కనెక్టర్లు
స్టోరేజ్ డివైజ్ యొక్క USB కనెక్టర్ మరియు USB పోర్ట్ యొక్క కాంటాక్ట్ ఉపరితలం నుండి ఇతర పదార్ధాలను తీసివేయండి.
USB హబ్ లేదా ఎక్స్‌టెన్షన్ కేబుల్ ఉపయోగించబడింది
USB స్టోరేజ్ డివైజ్ నేరుగా USB పోర్ట్‌కి కనెక్ట్ చేయండి.
ప్రామాణికం కాని USB స్టోరేజ్ డివైజ్ ఉపయోగించబడింది
సిస్టమ్‌కు అనుకూలంగా ఉండే USB స్టోరేజ్ డివైజ్ ఉపయోగించండి. > USB మోడ్”ను చూడండి.
పాడైన USB స్టోరేజ్ డివైజ్
USB స్టోరేజ్ డివైజ్ PCలో ఫార్మాట్ చేసి, దాన్ని మళ్లీ కనెక్ట్ చేయండి. పరికరాన్ని FAT16/32 ఫార్మాట్ లో ఫార్మాట్ చేయండి.

Bluetooth కనెక్షన్

లక్షణం
జరగటానికి అవకాశమున్న కారణం
పరిష్కారం
Bluetooth పరికరంలో సిస్టమ్ గుర్తించబడలేదు.
పెయిరింగ్ మోడ్ యాక్టివేట్ కాలేదు
అన్ని మెనూలు స్క్రీన్పై, సెట్టింగ్‌లు > పరికర కనెక్షన్ నొక్కండి మరియు సిస్టమ్ను పెయిరింగ్ మోడ్కు మార్చండి. ఆపై, పరికరంలో సిస్టమ్ కోసం మళ్లీ శోధించడానికి ప్రయత్నించండి.
Bluetooth పరికరం సిస్టమ్‌కి కనెక్ట్ చేయబడలేదు.
Bluetooth డియాక్టివేట్ చేయబడింది
పరికరంలో Bluetoothని యాక్టివేట్ చేయండి.
Bluetooth లోపం
  • Bluetoothని డీయాక్టివేట్ చేసి, పరికరంలో దాన్ని మళ్లీ యాక్టివేట్ చేయండి. అప్పుడు, పరికరాన్ని మళ్లీ కనెక్ట్ చేయండి.
  • పరికరాన్ని ఆఫ్ మరియు ఆన్ చేయండి. తర్వాత, దాన్ని మళ్లీ కనెక్ట్ చేయండి.
  • పరికరం నుండి బ్యాటరీని తీసివేసి, దాన్ని మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి. అప్పుడు, పరికరాన్ని ఆన్ చేసి, దాన్ని మళ్లీ కనెక్ట్ చేయండి లేదా పరికరాన్ని మళ్లీ ప్రారంభించి, తిరిగి కనెక్ట్ చేయండి.
  • సిస్టమ్ మరియు పరికరం రెండింటిలోనూ Bluetooth పెయిరింగ్‌ను అన్‌రిజిస్టర్ చేసి, ఆపై మళ్లీ నమోదు చేసి, వాటిని కనెక్ట్ చేయండి.

ఫోన్ ప్రొజెక్షన్

లక్షణం
జరగటానికి అవకాశమున్న కారణం
పరిష్కారం
ఫోన్ ప్రొజెక్షన్ స్టార్ట్ అవటం లేదు.
ఫోన్ ప్రొజెక్షన్‌కి ఫోన్ మద్దతు ఇవ్వదు
కింది వెబ్‌సైట్‌లను సందర్శించండి మరియు స్మార్ట్‌ఫోన్ సంబంధిత ఫంక్షన్‌కు మద్దతు ఇస్తుందో, లేదో చూసుకోండి.
USB కనెక్షన్‌కు మద్దతు లేదు
Apple CarPlay వైర్‌లెస్ ఫోన్ ప్రొజెక్షన్‌కు మద్దతు ఇచ్చే సిస్టమ్‌ల కోసం USB కనెక్షన్‌లకు మద్దతు ఇవ్వదు. మీ iPhoneని సిస్టమ్‌కి వైర్‌లెస్‌గా కనెక్ట్ చేయండి మరియు Apple CarPlayని ప్రారంభించండి. > Apple CarPlay ద్వారా మీ iPhoneను కనెక్ట్ చేయండి”ను చూడండి.
ఫోన్ ప్రొజెక్షన్ నిలిపివేయబడింది
  • వైర్‌లెస్ కనెక్టివిటీ మరియు ఉపయోగించగల కనెక్షన్ రకాల లభ్యతపై ఆధారపడి, కింది మార్గాలలో ఒకదాన్ని ఉపయోగించడం ద్వారా ఫోన్ ప్రొజెక్షన్‌ని ప్రారంభించండి:
  • USB కనెక్షన్ల కొరకు (వైర్‌లెస్ కనెక్టివిటీకి మద్దతు లేకపోతే): అన్ని మెనూలు > సెట్టింగ్‌లు > పరికర కనెక్షన్ నొక్కండి, ఆపై మీరు ఉపయోగించాలనుకుంటున్న ఫంక్షన్‌ను ఎంచుకోండి.
  • USB కనెక్షన్‌ల కోసం (వైర్‌లెస్ కనెక్టివిటీకి మద్దతు ఉంటే): USB కనెక్షన్‌లు Android Auto కోసం మాత్రమే అందుబాటులో ఉంటాయి. అన్ని మెనూలు > సెట్టింగ్‌లు > పరికర కనెక్షన్ నొక్కండి మరియు ఫోన్ ప్రొజెక్షన్ సెట్టింగ్‌ల మెనులో USB కనెక్టివిటీని యాక్టివేట్ చేయండి.
  • వైర్‌లెస్ ఫోన్ ప్రొజెక్షన్ కోసం: అన్ని మెనూలు > సెట్టింగ్‌లు > Wi-Fi నొక్కండి మరియు Wi-Fi కనెక్టివిటీని యాక్టివేట్ చేయండి.
  • స్మార్ట్‌ఫోన్‌లోని యాప్ సెట్టింగ్‌లు లేదా పరిమితి సెట్టింగ్‌లలో ఫంక్షన్ నిలిపివేయబడిందో లేదో తనిఖీ చేయండి.
స్మార్ట్‌ఫోన్ సిద్ధంగా లేదు లేదా పనిచేయడం లేదు
  • స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉందేమో తనిఖీ చేయండి. బ్యాటరీ తక్కువగా ఉంటే, స్మార్ట్‌ఫోన్‌ను గుర్తించలేకపోవచ్చు.
  • నెట్‌వర్క్ సిగ్నల్ బలహీనంగా ఉంటే, ఫోన్ ప్రొజెక్షన్ సరిగ్గా పని చేయకపోవచ్చు.
  • స్మార్ట్‌ఫోన్ లాక్ చేయబడితే, దాన్ని అన్‌లాక్ చేయండి.
  • స్మార్ట్‌ఫోన్‌ను రీసెట్ చేసి, దాన్ని మళ్లీ కనెక్ట్ చేయండి.
వైర్‌లెస్ కనెక్షన్‌లో ప్రామాణీకరణ లోపం
మీరు వైర్‌లెస్ కనెక్షన్‌ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, అన్ని మెనూలు > సెట్టింగ్‌లు > Wi-Fi నొక్కండి, కొత్త Wi-Fi పాస్‌కీని రూపొందించి, మళ్లీ ప్రయత్నించండి.
ఫోన్ ప్రొజెక్షన్ ప్రారంభమైనప్పుడు లేదా ఉపయోగంలో ఉన్నప్పుడు, బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుంది.
స్మార్ట్‌ఫోన్ పనిచేయకపోవడం
  • USB ద్వారా ఫోన్ ప్రొజెక్షన్ యాక్టివేట్ అయి ఉంటే, స్మార్ట్‌ఫోన్ నుండి USB కేబుల్‌ను డిస్‌కనెక్ట్ చేసి, కేబుల్‌ను మళ్లీ కనెక్ట్ చేయండి.
  • వైర్‌లెస్ కనెక్షన్ ద్వారా ఫోన్ ప్రొజెక్షన్ యాక్టివేట్ అయి ఉంటే, ఫోన్ ప్రొజెక్షన్ పరికరాల జాబితాను యాక్సెస్ చేయండి, స్మార్ట్‌ఫోన్‌ను డిస్‌కనెక్ట్ చేసి, దాన్ని మళ్లీ కనెక్ట్ చేయండి.
  • స్మార్ట్‌ఫోన్‌ను రీసెట్ చేసి, దాన్ని మళ్లీ కనెక్ట్ చేయండి.
వైర్‌లెస్ Android Auto కనెక్షన్ సరిగ్గా పని చేయదు.
సిస్టమ్ లేదా స్మార్ట్‌ఫోన్ పనిచేయకపోవడం
సిస్టమ్ మరియు మీ Android స్మార్ట్‌ఫోన్ నుండి కనెక్ట్ ఉన్న అన్ని పరికరాలను తొలగించి, ఆపై మళ్లీ కనెక్ట్ చేయండి.
సిస్టమ్ హోమ్ స్క్రీన్ నుండి:
  1. అన్ని మెనూలు > సెట్టింగ్‌లు > పరికర కనెక్షన్ > బ్లూటూత్ > బ్లూటూత్ కనెక్షన్‌లు > పరికరాలను డిలీట్ చేయండి ని నొక్కండి.
  1. అన్నింటిని మార్క్ చేయండి > తొలగించండి ని నొక్కండి.
  1. అవును నొక్కండి.
  1. పరికరాల నుండి డౌన్‌లోడ్ చేసిన డేటా కూడా తొలగించబడుతుంది.
మీ Android స్మార్ట్‌ఫోన్ నుండి:
  1. Android Auto కనెక్షన్ సెట్టింగ్‌లకు వెళ్లి, మునుపటి కనెక్ట్ చేసిన వాహనాలన్నీ తొలగించండి.
  1. కనెక్ట్ చేసిన వాహనాలను తొలగించే దాని గురించి మరింత సమాచారం కోసం, మీ స్మార్ట్‌ఫోన్ యూజర్ గైడ్‌ని చూడండి.
  1. మీ Android స్మార్ట్‌ఫోన్‌ను సిస్టమ్‌కి కనెక్ట్ చేయడం ప్రయత్నించండి. > చూడండి “వైర్‌లెస్ కనెక్షన్ ద్వారా Android Auto లేదా Apple CarPlayని ఉపయోగించడం (ఒకవేళ వైర్డ్ కనెక్టివిటీ మద్దతు ఉంటే).”

సిస్టమ్ ఆపరేషన్

లక్షణం
జరగటానికి అవకాశమున్న కారణం
పరిష్కారం
సిస్టమ్ ఆపివేయబడిన తర్వాత మరియు తిరిగి ప్రారంభించబడిన తర్వాత గతంలో ఉపయోగించిన మీడియా మోడ్ యాక్టివేట్ చేయబడదు.
సరిగాలేని కనెక్షన్ లేదా ప్లేబ్యాక్ లోపం
మీరు సిస్టమ్‌ను ఆన్ చేసినప్పుడు, సంబంధిత మీడియా స్టోరేజ్ డివైజ్ కనెక్ట్ కానట్లయితే లేదా ప్లేబ్యాక్‌లో సమస్య ఉంటే, మీరు గతంలో ఉపయోగించిన మోడ్ యాక్టివేట్ చేయబడుతుంది. మీడియా స్టోరేజ్ డివైజ్ మళ్లీ కనెక్ట్ చేయండి లేదా ప్లేబ్యాక్‌ని రీస్టార్ట్ చేయండి.
సిస్టమ్ నెమ్మదిగా ఉంది లేదా అది స్పందించటంలేదు.
అంతర్గత సిస్టమ్ లోపం
  • పెన్ లేదా పేపర్‌క్లిప్ వంటి తగిన సాధనంతో రీసెట్ బటన్‌ను నొక్కి పట్టుకోండి.
  • సమస్య కొనసాగుతూ ఉంటే, మీరు కొనుగోలు చేసిన ప్రదేశంలో లేదా డీలర్‌ను సంప్రదించండి.
సిస్టమ్ ఆన్ అవ్వలేదు.
ఫ్యూజ్ షార్ట్ చేయబడింది
  • మరమ్మతు దుకాణాన్ని సందర్శించండి మరియు తగిన ఫ్యూజ్‌తో భర్తీ చేయండి.
  • సమస్య కొనసాగుతూ ఉంటే, మీరు కొనుగోలు చేసిన ప్రదేశంలో లేదా డీలర్‌ను సంప్రదించండి.