USB పరికరం నుండి మ్యూజిక్‌కు వినటం
USB నిల్వ పరికరాలు మరియు MP3 ప్లేయర్ల వంటి, పోర్టబుల్ పరికరంలో నిల్వ చేసిన మీడియా ఫైల్లను ప్లే చేయవచ్చు. USB మోడ్‌ను ఉపయోగించే ముందు, అనుకూల USB నిల్వ పరికరాలు మరియు ఫైల్ స్పెసిఫికేషన్లను తనిఖీ చేయండి.
> “USB మోడ్”ను చూడండి.
గమనిక
వాహనం మోడల్ లేదా స్పెసిఫికేషన్లను బట్టి, అందుబాటులో ఉన్న బటన్లు లేదా మీ వాహనంలోని USB పోర్ట్ డిస్‌ప్లే మరియు వాటి లేఅవుట్ భిన్నంగా ఉండవచ్చు.
USB ప్లేయర్ను ప్రారంభించడం
- మీ USB పరికరాన్ని వాహనంలోని USB పోర్ట్‌కి కనెక్ట్ చేయండి.
- మీరు సిస్టమ్‌కు కనెక్ట్ చేసే పరికరాన్ని బట్టి ప్లేబ్యాక్ వెంటనే ప్రారంభించవచ్చు.
- హోమ్ స్క్రీన్‌పై అన్ని మెనూలు > మీడియా నొక్కండి లేదా కంట్రోల్ ప్యానెల్‌పై మీడియా బటన్‌ను నొక్కండి.
- మీడియా ప్లేయర్ పూర్తి స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
- మీకు బహుళ మీడియా నిల్వ పరికరాలు ఉంటే, కంట్రోల్ ప్యానెల్‌పై మీడియా బటన్‌ను మళ్లీ నొక్కి, మీడియా ఎంపిక విండోలోని USB సంగీతం నొక్కండి.
- ఫైల్ల జాబితాను యాక్సెస్ చేయండి.
- ఎంపికల జాబితాను డిస్‌ప్లే చేయండి.
- డిస్‌ప్లే ఆఫ్ చేయబడింది (ఒకవేళ అమర్చితే): స్క్రీన్‌ను ఆఫ్ చేయండి. దీనిని మళ్లీ ఆన్ చేయడానికి స్క్రీన్‌ను నొక్కండి.
- మీడియా వనరులు: మీరు ఉపయోగించాలనుకునే మీడియా నిల్వ పరికరాన్ని ఎంచుకోండి.
- ఈ ఆర్టిస్ట్ చే పాటలు: ప్రస్తుతం ప్లే అవుతున్న కళాకారుని పాటల జాబితాకు తరలించండి.
- ఈ ఆల్బమ్ నుండి పాటలు: ప్రస్తుతం ప్లే అవుతున్న ఆల్బమ్ నుండి పాటల జాబితాకు తరలించండి.
- సౌండ్ సెట్టింగ్‌లు: సిస్టమ్ సౌండ్ సెట్టింగ్‌లను అనుకూలీకరించండి. > “సౌండ్ సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయడం”ను చూడండి.
- మాన్యువల్: సిస్టమ్ కోసం ఆన్‌లైన్ వినియోగదారు మాన్యువల్‌కు యాక్సెస్ అందించే QR కోడ్‌ను ప్రదర్శించండి. భద్రతా కారణాల దృష్ట్యా, మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా పార్కింగ్ బ్రేక్ నిలిపివేయబడినప్పుడు లేదా అది డిజేబుల్ స్థితిలో ఉన్నప్పుడు మీరు QR కోడ్‌ను యాక్సెస్ చేయలేరు.
- మునుపటి స్థాయికి తిరిగి వెళ్లు.
- ప్రస్తుతం ప్లే అవుతున్న పాట గురించిన సమాచారం. కళాకారు లేదా ప్లే అవుతున్న ఆల్బమ్ ద్వారా పాటల జాబితాను యాక్సెస్ చేయడానికి పాటన కళాకారుని లేదా ఆల్బమ్ సమాచారాన్ని నొక్కండి.
- ప్రస్తుత ఫైల్ నంబర్ మరియు మొత్తం ఫైల్లు
- పునరావృతం ప్లే మోడ్‌ను మార్చడం.
- షఫుల్ ప్లే మోడ్‌ను యాక్టివేట్ లేదా డియాక్టివేట్ చేయండి.
- ప్రస్తుతం పాటను దాచు.
- ప్రస్తుత ప్లేబ్యాక్ను పునఃప్రారంభించండి లేదా మునుపటి పాటను ప్లే చేయండి. రివైండ్ చేయడానికి నొక్కి, పట్టుకోండి.
- ప్లేబ్యాక్‌ను పాజ్ లేదా పునఃప్రారంభించండి.
- తదుపరి పాటను ప్లే చేయండి. ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడానికి నొక్కి, పట్టుకోండి.
- ప్లేబ్యాక్ సమయం మరియు ప్లేబ్యాక్ పొసిషన్
జాగ్రత్త
- మీ సిస్టమ్‌కు USB పరికరాన్ని కనెక్ట్ చేసే ముందు మీ వాహనం ఇంజిన్‌ను ప్రారంభించండి. USB పరికరం కనెక్ట్ చేసి ఉంచి ఇంజిన్‌ను ప్రారంభించడం వలన USB పరికరానికి నష్టం కలిగించవచ్చు.
- USB పరికరాన్ని కనెక్ట్ లేదా డిస్‌కనెక్ట్ చేసేటప్పుడు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ జాగ్రత్త. స్టాటిక్ డిస్‌ఛార్జ్ సిస్టమ్ పనిచేయకపోవటానికి కారణం కావచ్చు.
- మీ శరీర భాగాలు లేదా బాహ్య వస్తువులు ఏవైనా USB పోర్ట్‌ను సంప్రదించకుండా జాగ్రత్త వహించండి. అలా చేయడం వలన ప్రమాదం కావచ్చు లేదా సిస్టమ్ పనిచేయకపోవటానికి కారణం కావచ్చు.
- USB కనెక్టర్‌ను తక్కువ సమయంలోపల మళ్లీ మళ్లీ కనెక్ట్ చేయడం మరియు డిస్‌కనెక్ట్ చేయడం చేయవద్దు. అలా చేయడం వలన పరికరంలో లోపానికి లేదా సిస్టమ్ పనిచేయకపోవటానికి కారణం కావచ్చు.
- ఫైల్లను ప్లే చేయడం మినహా మరి ఇతర ప్రయోజనాల కోసం USB పరికరాన్ని ఉపయోగించకండి. ఛార్జింగ్ లేదా వేడి చేయడం కోసం USB ఉపకరణాలు ఉపయోగించడం వలన బలహీన పనితీరుకి లేదా సిస్టమ్ పనిచేయకపోవటానికి కారణం కావచ్చు.
గమనిక
- వాహనం మోడల్ లేదా స్పెసిఫికేషన్లను బట్టి, డిస్‌ప్లే చేసిన స్క్రీన్‌లు మరియు అందుబాటులోని విధులు భిన్నంగా ఉండవచ్చు.
- USB నిల్వ పరికరాన్ని కనెక్ట్ చేస్తున్నప్పుడు, ఒక పొడిగింపు కేబుల్‌ను ఉపయోగించకండి. ఒకవేళ మీరు USB హబ్ లేదా ఒక పొడిగింపు కేబుల్‌ను ఉపయోగిస్తే, పరికరం గుర్తించబడకపోవచ్చు.
- USB పోర్ట్‌లోకి USB కనెక్టర్‌ను పూర్తిగా చొప్పించండి. అలా చేయకుంటే గనుక కమ్యూనికేషన్ లోపం సంభవించవచ్చు.
- మీరు USB పరికరాన్ని డిస్‌కనెక్ట్ చేసినట్లయితే, పాడైన శబ్దం రావచ్చు.
- స్డాండర్డ్ ఫార్మాట్‌లో ఎన్‌కోడ్ చేసిన ఫైల్లు మాత్రమే సిస్టమ్ ప్లే చేయవచ్చు.
- కింది USB పరికరాల రకాలు గుర్తించబడకపోవచ్చు లేదా సరిగ్గా పని చేయకపోవచ్చు:
- ఎన్‌క్రిప్ట్ చేసిన MP3 ప్లేయర్లు
- రిమోవేబుల్ డిస్క్‌ల వలె USB పరికరాలు గుర్తించబడవు
- USB పరికరం దాని కండీషన్ బట్టి గుర్తించబడకపోవచ్చు.
- కొన్ని USB పరికరాలు మీ సిస్టమ్‌కు అనుకూలంగా ఉండకపోవచ్చు.
- USB పరికరాల రకం, సామర్థ్యం లేదా ఫైల్ల ఫార్మాట్‌ను బట్టి, USB గుర్తింపు సమయం భిన్నంగా ఉండవచ్చు.
- స్పెసిఫికేషన్‌ను బట్టి, కొన్ని USB పరికరాలు USB కనెక్షన్ ద్వారా ఛార్జ్ చేయడాన్ని మద్దతు ఇవ్వకపోవచ్చు.
USB ప్లేయర్ను కంట్రోల్ చేయడం
మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను కంట్రోల్ చేయడానికి మీడియా ప్లేయర్ స్క్రీన్‌పై బటన్లను ఉపయోగించండి.
ప్లేబ్యాక్‌ను పాజ్/పునఃప్రారంభించడం
మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను పాజ్ చేయడానికి
నొక్కండి. మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను పునఃప్రారంభించడానికి
నొక్కండి.
రివైండ్/ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం
పాటను రివైండ్ లేదా ఫాస్ట్ ఫార్వార్డ్ చేయడానికి
లేదా
నొక్కి, పట్టుకోండి.
- ప్రత్యామ్నాయంగా, కంట్రోల్ ప్యానెల్‌పై బ్యాక్‌వార్డ్ బటన్ శోధన (SEEK) లేదా ఫార్వార్డ్ బటన్ శోధన (TRACK) నొక్కండి.
- మీరు స్టీరింగ్ వీల్‌పై శోధన లివర్/బటన్‌ను కూడా ఉపయోగించవచ్చు.
- మీరు స్క్రీన్‌పై ప్రొగ్రెస్ బార్‌ను నొక్కడం ద్వారా ప్లేబ్యాక్ పొసిషన్‌ను మార్చవచ్చు. ఎంచుకున్న లొకేషన్ నుండి మ్యూజిక్ ప్లే అవ్వటం ప్రారంభమౌతుంది.
ప్రస్తుత ప్లేబ్యాక్‌ను పునఃప్రారంభించడం
మూడు సేకన్ల ప్లేబ్యాక్ అయిన తరువాత, ప్రస్తుత పాటను పునఃప్రారంభించడానికి
నొక్కండి.
- ప్రత్యామ్నాయంగా, కంట్రోల్ ప్యానెల్‌పై బ్యాక్‌వార్డ్ శోధన బటన్ (SEEK) నొక్కండి.
- మీరు స్టీరింగ్ వీల్‌పై శోధన లివర్/బటన్‌ను కూడా ఉపయోగించవచ్చు.
మునుపటి లేదా తదుపరి పాటను ప్లే చేయడం
మునుపటి పాటను ప్లే చేయడానికి ప్రస్తుత పాట యొక్క ముందు మూడు సెకన్లలోపు
నొక్కండి. మూడు సేకన్ల ప్లేబ్యాక్ అయిన తరువాత,
రెండుసార్లు నొక్కండి. తదుపరి పాటను ప్లే చేయడానికి
నొక్కండి.
- ప్రత్యామ్నాయంగా, కంట్రోల్ ప్యానెల్‌పై బ్యాక్‌వార్డ్ బటన్ శోధన (SEEK) లేదా ఫార్వార్డ్ బటన్ శోధన (TRACK) నొక్కండి.
- మీరు స్టీరింగ్ వీల్‌పై శోధన లివర్/బటన్‌ను కూడా ఉపయోగించవచ్చు.
- కంట్రోల్ ప్యానెల్‌పై, కావల్సిన పాటను కనుగొనడానికి శోధన నాబ్ (TUNE FILE) తిప్పండి మరియు ఫైల్‌ను ప్లే చేయడానికి ఐదు సెకన్లలోపు నాబ్‌ను నొక్కండి. ఐదు సెనక్లలోపు ఎలాంటి కంట్రోల్ గుర్తించబడకుంటే, శోధన రద్దు అవుతుంది మరియు స్క్రీన్‌పై ప్రస్తుతం ప్లే అవుతున్న పాట సమాచారం డిస్‌ప్లే అవుతుంది.
పునరావృత్తం ప్లే చేయడం
ఫైల్‌ను పునరావృత్తం ప్లే చేయడానికి
నొక్కండి.
- ప్రతిసారి మీరు బటన్‌ను నొక్కినప్పుడు, సంబంధిత మోడ్ ఐకాన్ బటన్‌పై కనబడుతుంది.
గమనిక
ప్రస్తుత ప్లే జాబితాను బట్టి, అందుబాటులో ఉన్న పునరావృత్త ప్లే మోడ్‌లు భిన్నంగా ఉండవచ్చు. |
యాదృచ్చిక క్రమంలో ప్లే చేయడం
ప్లే క్రమాన్ని షఫుల్ చేయడానికి
నొక్కండి.
ప్రస్తుత ఫైల్‌ను దాచడం
సిస్టమ్ నుండి ప్రస్తుతం ప్లే అవుతున్న ఫైల్‌ను దాచడానికి
నొక్కండి. ఫైల్ ఫార్మాట్ “Hidden_” ఫోల్డర్‌కు తరలించబడింది.
గమనిక
FAT16/32 ఫార్మాట్‌లలో ఫార్మాట్ చేసిన USB నిల్వ పరికరాలు మాత్రమే దాచిన ఫైల్లకు మద్దతిస్తాయి. |
ఫైల్ల జాబితాలో మ్యూజిక్ ఫైల్ల కోసం శోధించడం
పాటను శోధించడానికి మరియు ఎంచుకోవడానికి ఫైల్లను యాక్సెస్ చేయడం.
- మ్యూజిక్ ప్లేబ్యాక్ స్క్రీన్‌పై, జాబితా నొక్కండి.
- ఫోల్టర్‌ను తెరవడానికి స్క్రీన్ నొక్కండి, మరొక వర్గానికి తరలించండి లేదా మ్యూజిక్ ఫైల్‌ను ప్లే చేయండి.
- ప్లేజాబితాను ప్లే చేస్తున్నప్పుడు ఉప ఫోల్డర్లోని అన్ని ఫైల్లను చేర్చడానికి మీడియా ప్లేయర్ను సెట్ చేయండి (ఒకవేళ అమర్చితే).
- ప్లేబ్యాక్ స్క్రీన్‌కు తిరిగి వెళ్లు.
- ఎంపికల జాబితాను డిస్‌ప్లే చేయండి.
- మీడియా వనరులు: మీరు ఉపయోగించాలనుకునే మీడియా నిల్వ పరికరాన్ని ఎంచుకోండి.
- ఇప్పుడు ప్లే అవుతోంది: ఒకవేళ ఇది ప్రస్తుత స్క్రీన్‌పై కనబడకుంటే ప్రస్తుతం ప్లే అవుతున్న ఫైల్‌కు తిరిగి వెళ్లు.
- మునుపటి స్థాయికి తిరిగి వెళ్లు.
- మరొక ఫోల్డర్/వర్గానికి తరలించడం.
- ఎంచుకున్న ఫోల్డర్ లేదా వర్గంలోని అన్ని ఫైల్లను ప్లే చేయి.
- వర్గాల ఆధారంగా పాటను శోధించు.
- స్క్రోల్ బార్