క్లయిమేట్ కంట్రోల్ సిస్టమ్‌ను ఉపయోగించడం (ఒకవేళ అమర్చితే)
మీరు మీ సిస్టమ్ స్క్రీన్ ద్వారా క్లయిమేట్ కంట్రోల్ సిస్టమ్ యొక్క ప్రస్తుత స్థితిని తనిఖీ చేయవచ్చు.
హోమ్ స్క్రీన్‌పై అన్ని మెనూలు > Climate నొక్కండి లేదా మీ వాహనంలోని [CLIMATE] బటన్‌ను నొక్కండి.
- క్లయిమేట్ కంట్రోల్ సిస్టమ్ ఎలా ఉపయోగించాలో దాని మరింత సమాచారం కోసం, మీ వాహనం యొక్క ఓనర్ మాన్యువల్‌ని చదవండి.
- ఎంపికల జాబితాను డిస్‌ప్లే చేయండి.
- Manual: సిస్టమ్ కోసం ఆన్‌లైన్ వినియోగదారు మాన్యువల్‌కు యాక్సెస్ అందించే QR కోడ్‌ను ప్రదర్శించండి. భద్రతా కారణాల దృష్ట్యా, మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా పార్కింగ్ బ్రేక్ నిలిపివేయబడినప్పుడు లేదా అది డిజేబుల్ స్థితిలో ఉన్నప్పుడు మీరు QR కోడ్‌ను యాక్సెస్ చేయలేరు.
- మునుపటి స్థాయికి తిరిగి వెళ్లు.
- అంతర్గత ఉష్ణోగ్రత (పాసెంజర్ల సీటు)
- ఎయిర్ డైరెక్షన్
- అంతర్గత ఉష్ణోగ్రత (డ్రైవర్ సీటు)
- అంతర్గత ఉష్ణోగ్రత (వెనుకన ఉన్న సీటు)
- ముందుభాగంలో ఉన్న ఫ్యాన్ స్పీడ్ మరియు ఆటో డిఫోగ్గింగ్ సిస్టమ్ (ADS) డియాక్టివేట్ చేయబడ్డాయి (ఒకవేళ అమర్చితే)
- వెనుక భాగంలో ఉన్న ఫ్యాన్ వేగం
- సింక్ మోడ్ యాక్టివేట్ చేయబడింది. సింక్ మోడ్‌లో, క్లయిమేట్ కంట్రోల్ స్క్రీన్‌పై డిస్‌ప్లే చేయబడే సీట్ల ఉష్ణోగ్రతలు డ్రైవర్ సైడ్ సెట్ చేసిన దానికి సమకాలీకరించబడతాయి.
- ఎయిర్ కండీషనర్ ఆన్ మరియు ఆఫ్ చేయబడింది
- AUTO మోడ్ యాక్టివేట్ చేయబడింది మరియు డీయాక్టివేట్ చేయబడింది
మీరు మీ సిస్టమ్‌ని ఉపయోగించేటప్పుడు క్లయిమేట్ కంట్రోల్ సిస్టమ్‌ని ఆపరేట్ చేస్తే, క్లయిమేట్ కంట్రోల్ సెట్టింగ్‌లు స్క్రీన్ పైభాగంలో డిస్‌ప్లే చేయబడతాయి.
గమనిక
- అంతర్గత ఉష్ణోగ్రత 0.5°C యూనిట్లలో డిస్‌ప్లే చేయబడుతుంది.
- ఆటో మోడ్ కింది పరిస్థితుల్లో స్వయంచాలకంగా డియాక్టివేట్ చేయబడుతుంది:
- మీరు ఫ్యాన్ స్పీడ్ లేదా డైరెక్షన్‌ను సర్దుబాటు చేసినప్పుడు
- మీరు ఎయిర్ కండీషనర్‌ను ఆన్ లేదా ఆఫ్ చేసినప్పుడు
- మీరు ముందుభాగం విండ్‌షీల్డ్ డిఫ్రోస్టర్‌ను యాక్టివేట్ చేసినప్పుడు
- వాహనం మోడల్ లేదా స్పెసిఫికేషన్లను బట్టి, డిస్‌ప్లే చేసిన స్క్రీన్‌లు మరియు అందుబాటులోని విధులు భిన్నంగా ఉండవచ్చు.