ఫోన్

Bluetooth ద్వారా కాల్‌కు సమాధానం ఇవ్వటం


మీరు కాల్ సమయంలో కాల్‌లను ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు మరియు సౌకర్యవంతమైన విధులను ఉపయోగించవచ్చు.

కాల్‌ను ఆమోదించడం లేదా తిరస్కరించడం

కాల్ వచ్చినప్పుడు, ఇన్‌కమింగ్ కాల్ యొక్క నోటిఫికేషన్ పాప్-అప్ విండో సిస్టమ్ స్క్రీన్‌పై కనబడుతుంది.
కాల్‌కు సమాధానం ఇవ్వడానికి, అంగీకరించు నొక్కండి.
  • ప్రత్యామ్నాయంగా, స్టీరింగ్ వీల్‌పై కాల్/సమాధానం బటన్‌ని నొక్కండి.
కాల్‌ను తిరస్కరించడానికి, తిరస్కరించండి నొక్కండి.
హెచ్చరిక
  • Bluetooth పరికరాలను కనెక్ట్ చేసే ముందు మీ వాహనాన్ని సురక్షిత ప్రదేశంలో పార్క్ చేయండి. పరధ్యానంలో డ్రైవింగ్ చేయడం ట్రాఫిక్ ప్రమాదానికి దారితీయవచ్చు మరియు తీవ్రమైన వ్యక్తిగత గాయం లేదా మరణానికి దారితీయవచ్చు.
  • డ్రైవ్ చేస్తునప్పుడు ఎప్పుడూ మీ మొబైల్ ఫోన్‌ను పిక్ చేయవద్దు. మొబైలే ఫోన్‌ని ఉపయోగిస్తే, ఇది మీ డ్రైవింగ్‌ని పరధ్యానం చేయవచ్చు, బాహ్య పరిస్థితులను గుర్తించానికి కష్షమౌవచ్చు మరియు ప్రమాదాలకు దారితీసే ఘటనలు, ఊహించని పరిస్థితుల కారణంగా మీ కేంద్రికరణ సామర్థ్యాన్ని తగ్గించవచ్చు. అవసరమైతే, కాల్ చేయడానికి మరియు కాల్‌ను వీలైనంత తక్కువగా మాట్లాడడానికి Bluetooth హ్యాండ్స్‌ఫ్రీ ఫీచర్‌ని ఉపయోగించండి.
గమనిక
  • మొబైల్ ఫోన్ రకాన్ని బట్టి, కాల్ తిరస్కరణకు మద్దతు ఉండకపోవచ్చు.
  • మీ మొబైల్ ఫోన్ సిస్టమ్‌కు కనెక్ట్ అయినప్పుడు, ఫోన్ కనెక్షన్ రేంజ్‌లోపల మీరు వాహనం నుండి బయటకి వచ్చిన తరువాత కూడా వాహనం స్పీకర్ల ద్వారా కాల్ సౌండ్ అవుట్‌పుట్ కావచ్చు. కనెక్షన్‌ను ముగించడానికి, పరికరాన్ని సిస్టమ్ నుండి డిస్‌కనెక్ట్ చేయండి లేదా Bluetoothను పరికరం నుండి డియాక్టివేట్ చేయండి.
  • మీరు ఇన్‌కమింగ్ కాల్ పాప్-అప్ విండోపై గోప్యతా మోడ్ నొక్కడం ద్వారా గోప్యత విధానాన్ని యాక్టివేట్ చేయవచ్చు. గోప్యత విధానంలో, పరిచయ సమాచారం ప్రదర్శించబడకపోవచ్చు. గోప్యత విధానాన్ని డియాక్టివేట్ చేయడానికి, Bluetooth ఫోన్ స్క్రీన్‌పై మెనూ > గోప్యతా మోడ్ నొక్కండి. (ఒకవేళ అమర్చితే)

కాల్ సమయంలో విధులను ఉపయోగించడం

కాల్ సమయంలో, దిగువన చూపబడిన కాల్ స్క్రీన్‌ను మీరు చూస్తారు. మీకు కావల్సిన విధిని నిర్వహించడానికి బటన్‌ను నొక్కండి.
  1. ఎంపికల జాబితాను డిస్‌ప్లే చేయండి (ఒకవేళ అమర్చితే).
  1. డిస్‌ప్లే ఆఫ్ చేయబడింది: స్క్రీన్‌ను ఆఫ్ చేయండి. దీనిని మళ్లీ ఆన్ చేయడానికి స్క్రీన్‌ను నొక్కండి.
  2. గోప్యతా మోడ్: మీ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడానికి గోప్యత విధానాన్ని యాక్టివేట్ చేయండి. గోప్యత విధానంలో, వ్యక్తిగత డేటా ప్రదర్శించబడదు.
  1. మునుపటి స్థాయికి తిరిగి వెళ్లు.
  1. మైక్రోఫోన్‌ను ఆఫ్ చేయండి ఇందువలన ఇతర పార్టీ మిమ్మల్ని వినలేరు.
  1. మైక్రోఫోన్ వాల్యూమ్‌ను సర్దుబాటు చేయండి.
  1. కీప్యాడ్‌ను డిస్‌ప్లే లేదా దాచండి.
  1. కాల్‌ను మీ మొబైల్ ఫోన్‌కు మారండి. మొబైల్ ఫోన్ రకాన్ని బట్టి, ఈ విధికి మద్దతు ఉండకపోవచ్చు.
  1. కాల్‌ని ముగించండి.
గమనిక
  • మీ పరిచయాల జాబితాలో కాలర్ సమాచారం సేవ్ చేసినట్లయితే, కాలర్ పేరు మరియు ఫోన్ నంబర్ ప్రదర్శించబడుతంది. మీ పరిచయాల జాబితాలో కాలర్ సమాచారం సేవ్ చేయనట్లయితే గనుక, కాలర్ ఫోన్ నంబర్ మాత్రమే ప్రదర్శించబడుతంది.
  • మీరు Bluetooth కాల్ సమయంలో రేడియో లేదా మీడియాను ఆపరేట్ చేయలేరు లేదా పరికర సెట్టింగ్‌లను మార్చలేరు.
  • మొబైల్ ఫోన్ రకాన్ని బట్టి, కాల్ నాణ్యత భిన్నంగా ఉండవచ్చు. కొన్ని ఫోన్‌లలో, మీ వాయిస్ ఇతర పార్టీలకు తక్కువగా వినబడవచ్చు.
  • మొబైల్ ఫోన్ రకాన్ని బట్టి, ఫోన్ నంబర్ సరిగ్గా ప్రదర్శించబడకపోవచ్చు.
  • వాహనం మోడల్ లేదా స్పెసిఫికేషన్లను బట్టి, డిస్‌ప్లే చేసిన స్క్రీన్‌లు మరియు అందుబాటులోని విధులు భిన్నంగా ఉండవచ్చు.

కాల్‌ల మధ్య మారడం

మీ మొబైల్ ఫోన్ కాల్ వేయిటింగ్‌ను మద్దతిస్తే, మీరు రెండవ కాల్ ఆమోదించవచ్చు. మొదటి కాల్ హోల్డ్‌పై ఉంటుంది.
యాక్టివ్ కాల్ మరియు హెల్డ్ కాల్ మధ్య మారడానికి, స్విచ్ నొక్కండి లేదా కాల్ స్క్రీన్‌పై ప్రదర్శించబడిన ఫోన్ నంబర్‌ని నొక్కండి.
  • మీరు కాల్‌ల మధ్య మారడానికి స్టీరింగ్ వీల్‌పై కాల్/సమాధానం బటన్‌ని కూడా నొక్కవచ్చు.
గమనిక
మొబైల్ ఫోన్ రకాన్ని బట్టి, ఈ విధికి మద్దతు ఉండకపోవచ్చు.