ఫోన్

Bluetooth పరికరాలను కనెక్ట్ చేయడం


Bluetooth షార్ట్-రేంజ్ వైర్‌లెస్ నెట్‌వర్కింగ్ టెక్నాలాజీ. Bluetooth ద్వారా, కనెక్ట్ చేయబడిన పరికరాల మధ్య డేటాను పంపడానికి లేదా స్వీకరించడానికి సమీపంలోని మొబైల్ పరికరాల వైర్‌లెస్‌గా కనెక్ట్ చేయవచ్చు. ఇది పరికరాలను సమర్థవంతంగా ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
మీ సిస్టమ్‌పై, మీరు Bluetooth హ్యాండ్స్‌ఫ్రీ మరియు ఆడియో ఫీచర్లను మాత్రమే ఉపయోగించవచ్చు. Bluetooth హ్యాండ్స్‌ఫ్రీ లేదా ఆడియో ఫీచర్‌ను మద్దతిచ్చే మొబైల్ పరికరాన్ని కనెక్ట్ చేయండి.
హెచ్చరిక
Bluetooth పరికరాలను కనెక్ట్ చేసే ముందు మీ వాహనాన్ని సురక్షిత ప్రదేశంలో పార్క్ చేయండి. పరధ్యానంలో డ్రైవింగ్ చేయడం ట్రాఫిక్ ప్రమాదానికి దారితీయవచ్చు మరియు తీవ్రమైన వ్యక్తిగత గాయం లేదా మరణానికి దారితీయవచ్చు.

మీ సిస్టమ్‌తో పరికరాలను జతపర్చడం

Bluetooth కనెక్షన్ల కోసం, దీనిని Bluetooth పరికరాల జాబితాకు జోడించడానికి మీ సిస్టమ్‌తో మీ పరికరాన్ని ముందుగా జతపరచండి. మీరు ఆరు పరికరాల వరకు జోడించవచ్చు.
  1. హోమ్ స్క్రీన్‌పై, అన్ని మెనూలు > సెట్టింగ్‌లు > పరికర కనెక్షన్ > బ్లూటూత్ > బ్లూటూత్ కనెక్షన్‌లు > కొత్తదాన్ని జోడించండి నోక్కండి.
  1. మీరు మీ సిస్టమ్‌తో మొదటిసారిగా పరికరాన్ని జతపర్చుతున్నట్లయితే, మీరు స్టీరింగ్ వీల్‌పై కాల్/సమాధానం బటన్‌ను కూడా నొక్కవచ్చు. ప్రత్యామ్నాయంగా, హోమ్ స్క్రీన్‌పై, అన్ని మెనూలు > ఫోన్ నొక్కండి.
  1. మీరు ఉపయోగించాలనుకునే విధిని ఎంచుకోని సరే నొక్కండి.
  1. మీరు కనెక్ట్ చేయాలనుకుంటున్న Bluetoothపై, Bluetoothను యాక్టివేట్ చేయండి, మీ వాహనం సిస్టమ్ కోసం శోధించండి మరియు ఆపై దీనిని ఎంచుకోండి.
  1. సిస్టమ్ స్క్రీన్‌పై కొత్త రిజిస్ట్రేషన్ పాప్-అప్ విండోలో ప్రదర్శించబడిన, సిస్టమ్ యొక్క Bluetooth పేరుని తనిఖీ చేయండి.
  1. Bluetooth పరికర స్క్రీన్ మరియు సిస్టమ్ స్క్రీన్‌పై ప్రదర్శించబడే Bluetooth పాస్‌కీలు ఒకేలా ఉన్నాయని నిర్ధారించుకోండి అలాగే పరికరం నుండి కనెక్షన్‌ను నిర్ధారించుకోండి.
  1. మీరు మొబైల్ ఫోన్‌ను కనెక్ట్ చేస్తే, పరికరం నుండి మీ డేటాను యాక్సెస్ మరియు డౌన్‌లోడ్ చేయడానికి సిస్టమ్‌ను అనుమతించండి.
  1. డేటాను డౌన్‌లోడ్ చేయడం Bluetooth కాల్ విధుల కోసం మాత్రమే. మీరు ఒక ఆడియో పరికరాన్ని కనెక్ట్ చేసినట్లయితే అనుమతి అవసరం.
గమనిక
  • పరికరాన్ని యాక్సెస్ చేయడానికి మీరు సిస్టమ్‌ను అనుమతించిన తరువాత పరికరంతో కనెక్ట్ చేయడానికి సిస్టమ్ కొంత సమయం తీసుకోవచ్చు. కనెక్షన్ నిర్వహించినప్పుడు, Bluetooth స్టేటస్ ఐకాన్ స్క్రీన్ పైభాగంలో కనబడుతుంది.
  • మీరు మొబైల్ ఫోన్ Bluetooth సెట్టింగ్‌లు మెను ద్వారా అనుమతి సెట్టింగ్‌లను మార్చవచ్చు. మరింత సమాచారం కోసం, మీ మొబైల్ ఫోన్ యూజర్ గైడ్‌ని చూడండి.
  • రెండు పరికరాలను Bluetooth ద్వారా సిస్టమ్‌కి కనెక్ట్ చేసినప్పుడు, మీరు మరొక పరికరాన్ని జత చేయలేరు.
  • సిస్టమ్ స్వయంచాలకంగా పరికరంతో కనెక్ట్ చేయాలనుకుంటే, మీ పరికరంలోని Bluetoothని డియాక్టివేట్ చేయండి.

జతపర్చిన పరికరాన్ని కనెక్ట్ చేయడం

మీ సిస్టమ్‌పై Bluetooth పరికరాన్ని ఉపయోగించడానికి, సిస్టమ్‌కి జతపర్చిన పరికరాన్ని కనెక్ట్ చేయండి. మీరు Bluetooth హ్యాండ్స్‌ఫ్రీ కోసం పరికరంతో లేదా Bluetooth ఆడియో కోసం ఒకేసారి రెండు పరికరాలతో మీ సిస్టమ్‌కు కనెక్ట్ చేయవచ్చు.
వాహనం మోడల్ లేదా స్పెసిఫికేషన్లను బట్టి, డిస్‌ప్లే చేసిన స్క్రీన్‌లు మరియు అందుబాటులోని విధులు భిన్నంగా ఉండవచ్చు.

ఎంపిక ఎ

  1. హోమ్ స్క్రీన్‌పై అన్ని మెనూలు > Settings > Device connection > Bluetooth > Bluetooth connections నొక్కండి.
  1. పరికర పేరుని లేదా Connect నొక్కండి.
  1. మీ సిస్టమ్‌ను మరొక పరికరం ఇప్పటికే కనెక్ట్ చేసి ఉంటే, దానిని డిస్‌కనెక్ట్ చేయండి. పరికరం తదుపరి Disconnect నొక్కండి.
  1. ఎంపికల జాబితాను డిస్‌ప్లే చేయండి.
  1. Manual: సిస్టమ్ కోసం ఆన్‌లైన్ వినియోగదారు మాన్యువల్‌కు యాక్సెస్ అందించే QR కోడ్‌ను ప్రదర్శించండి. భద్రతా కారణాల దృష్ట్యా, మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా పార్కింగ్ బ్రేక్ నిలిపివేయబడినప్పుడు లేదా అది డిజేబుల్ స్థితిలో ఉన్నప్పుడు మీరు QR కోడ్‌ను యాక్సెస్ చేయలేరు.
  1. మునుపటి స్థాయికి తిరిగి వెళ్లు.
  1. పరికరాన్ని కనెక్ట్ చేయి.
  1. సిస్టమ్‌తో జతపర్చిన Bluetooth పరికరాల జాబితా. పరికరాన్ని కనెక్ట్ లేదా డిస్‌కనెక్ట్ చేయడానికి పరికర పేరుని నొక్కండి.
  1. పరికరాన్ని డిస్‌కనెక్ట్ చేయి.
  1. Bluetooth పరికరంపై ఉపయోగించాలనుకునే విధిని ఎంచుకోండి.
  1. మీ సిస్టమ్‌తో కొత్త పరికరాన్ని జతపర్చండి.
  1. జతపర్చిన పరికరాలను తొలగించండి. పరికరాల నుండి డౌన్‌లోడ్ చేసిన డేటా కూడా తొలగించబడుతుంది.

ఎంపిక బి

  1. హోమ్ స్క్రీన్‌పై అన్ని మెనూలు > సెట్టింగ్‌లు > పరికర కనెక్షన్ > బ్లూటూత్ > బ్లూటూత్ కనెక్షన్‌లు నొక్కండి.
  1. పరికర పేరుని నొక్కండి.
  1. మీ సిస్టమ్‌ను మరొక పరికరం ఇప్పటికే కనెక్ట్ చేసి ఉంటే, దానిని డిస్‌కనెక్ట్ చేయండి. పరికర పేరుని నొక్కండి మరియు పాప్-అప్ విండో నుండి డిస్‌కనెక్ట్ నొక్కండి.
  1. ఎంపికల జాబితాను డిస్‌ప్లే చేయండి.
  1. డిస్‌ప్లే ఆఫ్ చేయబడింది (ఒకవేళ అమర్చితే): స్క్రీన్‌ను ఆఫ్ చేయండి. దీనిని మళ్లీ ఆన్ చేయడానికి స్క్రీన్‌ను నొక్కండి.
  2. ఆటో కనెక్షన్ ప్రాధాన్యత: సిస్టమ్ స్వయంచాలకంగా ఆన్ అయ్యేటప్పుడు మీ సిస్టమ్ కోసం జతపర్చిన పరికరాలను ప్రాధాన్యతగా సెట్ చేయండి.
  3. మాన్యువల్: సిస్టమ్ కోసం ఆన్‌లైన్ వినియోగదారు మాన్యువల్‌కు యాక్సెస్ అందించే QR కోడ్‌ను ప్రదర్శించండి. భద్రతా కారణాల దృష్ట్యా, మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా పార్కింగ్ బ్రేక్ నిలిపివేయబడినప్పుడు లేదా అది డిజేబుల్ స్థితిలో ఉన్నప్పుడు మీరు QR కోడ్‌ను యాక్సెస్ చేయలేరు.
  1. మునుపటి స్థాయికి తిరిగి వెళ్లు.
  1. సిస్టమ్‌తో జతపర్చిన Bluetooth పరికరాల జాబితా. పరికరాన్ని కనెక్ట్ లేదా డిస్‌కనెక్ట్ చేయడానికి పరికర పేరుని నొక్కండి.
  1. మీ సిస్టమ్‌తో కొత్త పరికరాన్ని జతపర్చండి.
  1. జతపర్చిన పరికరాలను తొలగించండి. పరికరాల నుండి డౌన్‌లోడ్ చేసిన డేటా కూడా తొలగించబడుతుంది.
  1. మీరు ఉపయోగించాలనుకునే విధిని ఎంచుకోని సరే నొక్కండి.
గమనిక
  • మీరు Bluetooth పరికరాన్ని కనెక్ట్ చేయకుంటే, Bluetooth పరికరంలో యాక్టివేట్ చేసి ఉందాఅని తనిఖీ చేయండి.
  • కనెక్షన్ రేంజ్ వెలుపల పరికరం ఉన్న కారణంగా కనెక్షన్ ముగిస్తే లేదా పరికర లోపం ఏర్పడితే, పరికరం కనెక్షన్ రేంజ్‌లోకి వచ్చినప్పుడు లేదా లోపం పరిష్కరించబడినప్పుడు కనెక్షన్ స్వయంచాలకంగా పునరుద్ధరించబడుతుంది.
  • కమ్యూనికేషన్ లోపం కారణంగా కనెక్షన్ స్థిరంగా లేకుంటే గనుక, అన్ని మెనూలు > సెట్టింగ్‌లు > పరికర కనెక్షన్ > బ్లూటూత్ > రీసెట్ నొక్కడం ద్వారా Bluetoothను రీసెట్ చేయండి మరియు ఆపై పరికరాన్ని తిరిగి కనెక్ట్ చేయండి. (ఒకవేళ అమర్చితే)
  • వాహనం మోడల్ లేదా స్పెసిఫికేషన్లను బట్టి, డిస్‌ప్లే చేసిన స్క్రీన్‌లు మరియు అందుబాటులోని విధులు భిన్నంగా ఉండవచ్చు.

పరికరాన్ని డిస్‌కనెక్ట్ చేయడం

మీరు Bluetooth పరికరాన్ని ఉపయోగించడం ఆపివేయాలనుకుంటే లేదా మరొక పరికరాన్ని కనెక్ట్ చేయాలనుకుంటే, ప్రస్తుతం కనెక్ట్ చేసి ఉన్న పరికరాన్ని డిస్‌కనెక్ట్ చేయండి.
వాహనం మోడల్ లేదా స్పెసిఫికేషన్లను బట్టి, డిస్‌ప్లే చేసిన స్క్రీన్‌లు మరియు అందుబాటులోని విధులు భిన్నంగా ఉండవచ్చు.

ఎంపిక ఎ

  1. హోమ్ స్క్రీన్‌పై అన్ని మెనూలు > సెట్టింగ్‌లు > పరికర కనెక్షన్ > బ్లూటూత్ > బ్లూటూత్ కనెక్షన్‌లు నొక్కండి.
  1. పరికర పేరుని లేదా డిస్‌కనెక్ట్ నొక్కండి.
  1. అవును నొక్కండి.

ఎంపిక బి

  1. హోమ్ స్క్రీన్‌పై అన్ని మెనూలు > సెట్టింగ్‌లు > పరికర కనెక్షన్ > బ్లూటూత్ > బ్లూటూత్ కనెక్షన్‌లు నొక్కండి.
  1. పరికర పేరుని నొక్కండి.
  1. డిస్‌కనెక్ట్ నొక్కండి.

జతపర్చిన పరికాలను తొలగించడం

Bluetooth పరికరాల జాబితా నిండినప్పుడు మీరు Bluetooth పరికరాన్ని ఇకపై జతపర్చకుంటే లేదా మీరు కొత్త పరికరాన్ని కనెక్టే చేయాలనుకుంటే, జతపర్చిన పరికరాలను తొలగించండి.
  1. హోమ్ స్క్రీన్‌పై, అన్ని మెనూలు > సెట్టింగ్‌లు > పరికర కనెక్షన్ > బ్లూటూత్ > బ్లూటూత్ కనెక్షన్‌లు > పరికరాలను డిలీట్ చేయండి నోక్కండి.
  1. మీరు తొలగించాలనుకునే పరికరాలను ఎంచుకోని తొలగించండి నొక్కండి.
  1. జతపర్చిన అన్ని పరికరాలను తొలగించడానికి, అన్నింటిని మార్క్ చేయండి > తొలగించండి నొక్కండి.
  1. అవును నొక్కండి.
  1. పరికరాల నుండి డౌన్‌లోడ్ చేసిన డేటా కూడా తొలగించబడుతుంది.
గమనిక
మీ సిస్టమ్ వైర్‌లెస్ ఫోన్ ప్రొజెక్షన్‌ను ఉపయోగిస్తే మరియు మీరు Bluetooth పరికరాల జాబితా నుండి పరికరాన్ని తొలగిస్తే, ఇది ఫోన్ ప్రొజెక్షన్ పరికరాల జాబితా నుండి కూడా తొలగించబడుతుంది.