ఉపయోగకరమైన విధులు

డ్రైవింగ్ సహాయక స్క్రీన్ గురించి తెలుసుకోవడం


మీరు మీ సిస్టమ్ స్క్రీన్‌పై మీ వాహనం వెలుపల వీక్షించవచ్చు. వాహనం మోడల్ లేదా స్పెసిఫికేషన్లను బట్టి, డిస్‌ప్లే చేసిన స్క్రీన్‌లు మరియు అందుబాటులోని విధులు భిన్నంగా ఉండవచ్చు.
హెచ్చరిక
రివర్స్ చేస్తున్నప్పుడు, కింది మార్గదర్శకాలను పాటించడం నిర్ధారించుకోండి:
  • మీ వాహనంతో వెళ్ళేముందు, మీ వాహనం వెనుక ప్రదేశాన్ని ఎల్లప్పు డూ తనిఖీ చేయండి.
  • రివర్స్ చేస్తున్నప్పుడు వెనుక వీక్షణ కెమెరాపై మాత్రమే ఆధారపడవద్దు. మీ వాహనం వెనుక ప్రదేశం తనిఖీ చేయడం మరియు రియర్‌వ్యూ మిర్రర్‌ల్లో చూడం ద్వారా రివర్స్ చేయడం సురక్షితం అని ఎల్లప్పుడూ నిర్ధారించుకోండి.
  • మీరు ఎప్పుడైనా రివర్స్ నెమ్మదిగా చేయండి మరియు వ్యక్తిగాని, ముఖ్యంగా పిల్లలు మీ వాహనం వెనుక ప్రదేశంలో ఉన్నారని మీరు అనుమానించినట్లయితే వెంటనే ఆపండి.
జాగ్రత్త
వెనుక భాగం వీక్షణ స్క్రీన్‌లో చూపించిన దూరం అసలు దూరం కంటే భిన్నంగా ఉండవచ్చు. భద్రతా కోసం, మీ వాహనం వెనుక భాగం ప్రదేశాన్ని, ఎడమ మరియు కుడి పక్కలను చూసి తనిఖీ చేయండి.

వెనుక భాగం వీక్షణ స్క్రీన్

ఇంజిన్ అమలులో ఉన్నప్పుడు “R” (రివర్స్) షిఫ్ట్ అవుతున్నప్పుడు, సిస్టమ్ స్క్రీన్ స్వయంచాలకంగా వెనుక భాగం వీక్షణను అలాగే పార్కింగ్ గైడ్‌లు ప్రదర్శిస్తుంది.
ఎంపిక ఎ
ఎంపిక బి
  • డ్రైవింగ్ డైరెక్షన్ లైన్లు (పసుపు)
  • ఈ లైన్లు స్టీరింగ్ యాంగిల్ ప్రకారం వాహనం డైరెక్షన్లను చూపుతుంది.
  • న్యుట్రల్ డైరెక్షన్ లైన్లు (నీలం)
  • న్యూట్రల్ పొనిషన్‌లో స్టీరింగ్ వీల్‌తో మీ వాహనం నిరీక్షించిన మార్గాన్ని సూచిస్తుంది. పార్కింగ్ స్థలంలో వాహనం సరైన స్థితిలో ఉందో లేదో గుర్తించడంలో అలాగే ముందున్న వాహనానికి చాలా దగ్గరగా పార్కింగ్ చేయకుండా నిరోధించడంలో ఇది మీకు సహాయపడుతుంది. (ఒకవేళ అమర్చితే)
  • క్రాష్ వార్నింగ్ లైన్లు (ఎరుపు)
  • ఈ లైన్లు మరొక వాహనానికి తాకకుండా నివారించడంలో సహాయపడతాయి.
గమనిక
  • వాహనం మోడల్ లేదా స్పెసిఫికేషన్‌లను బట్టి, ప్రదర్శించబడే స్క్రీన్ మరియు అందుబాటులో ఉండే ఫంక్షన్‌లు మారవచ్చు.
  • మీరు వాహనం మోడల్ లేదా స్పెసిఫికేషన్‌లను బట్టి కింది మార్గాలలో ఒకదాన్ని ఉపయోగించడం ద్వారా వెనుక వీక్షణ కెమెరా కోసం ఆపరేషన్ సెట్టింగ్‌ను మార్చవచ్చు.
  • హోమ్ స్క్రీన్‌పై, అన్ని మెనూలు > సెట్టింగ్‌లు > అడ్వాన్స్‌డ్‌ లేదా డిస్‌ప్లే > వెనుక కెమెరా ఉపయోగాన్ని విస్తరించండి నొక్కండి మరియు వెనుక కెమెరా ఉపయోగాన్ని విస్తరించండి ఎంపికను యాక్టివేట్ లేదా డియాక్టివేట్ చేయండి.
  • వెనుక వీక్షణ స్క్రీన్‌పై > కంటెంట్‌లను డిస్‌ప్లే చేయండి > వెనుక కెమెరా ఉపయోగాన్ని విస్తరించండి నొక్కి, వెనుక కెమెరా ఉపయోగాన్ని విస్తరించండి ఎంపికను యాక్టివేట్ లేదా డియాక్టివేట్ చేయండి.
  • ఒకవేళ మీరు ఎంపికను యాక్టివేట్ చేస్తే, మీరు వాహనాన్ని రివర్స్ చేసిన తరువాత “R” (రివర్స్) చేయకుండా మరేదైనా స్థానానికి మార్చినప్పటికీ వెనుక భాగం వీక్షణ స్క్రీన్ యాక్టివ్‌గా ఉంటుంది. మీరు ముందుగా నిర్ణయించిన వేగంతో లేదా అంతకంటే వేగంగా డ్రైవ్ చేసినప్పుడు, వెనుక వీక్షణ స్క్రీన్ క్రియారహితం చేయబడుతుంది అలాగే సిస్టమ్ స్వయంచాలకంగా మునుపటి స్క్రీన్‌ను ప్రదర్శిస్తుంది. (ఒకవేళ అమర్చితే)
  • మీరు వాహనం పార్క్ చేసేటప్పుడు ఏదైనా వస్తువు దగ్గర్లోని వచ్చినప్పుడు, హెచ్చరిక బీప్ సౌండ్ వస్తుంది. మీరు బీప్ సౌండ్‌ను వినకుంటే సంభవించే ప్రమాదాన్ని నివారించడానికి, వాహనాన్ని పార్క్ చేస్తున్నప్పుడు ఏదైనా మీడియా ప్లేయర్‌ను స్వయంచాలకంగా దాని వాల్యూమ్ స్థాయిని తగ్గించడానికి మీరు సిస్టమ్‌ను సెట్ చేయవచ్చు. హోమ్ స్క్రీన్‌పై, అన్ని మెనూలు > సెట్టింగ్‌లు > సౌండ్ > ప్రాధాన్యత, మార్గదర్శనం లేదా డ్రైవర్ అసిస్టెన్స్ వార్నింగ్ > పార్కింగ్ సేఫ్టీ ప్రాధాన్యత నొక్కండి.

డ్రైవ్ చేస్తున్నప్పుడు వెనుక భాగం వీక్షణను తనిఖీ చేయండి (ఒకవేళ అమర్చితే)

మీరు డ్రైవింగ్ వెనుక భాగం వీక్షణ మానిటర్‌ను ఉపయోగించి సిస్టమ్ స్క్రీన్ నుండి వెనుక భాగం వీక్షణను తనిఖీ చేయవచ్చు (DRVM).
హోమ్ స్క్రీన్‌పై, అన్ని మెనూలు > DRVM నొక్కండి.
  • స్క్రీన్‌పై వెనుక భాగం వీక్షణ డిస్‌ప్లే అవుతుంది. స్క్రీన్‌పై, వెనుక భాగం వీక్షణ యాక్టివ్‌గా ఉందని సూచించేందుకు కనబడుతుంది.
వెనుక భాగం వీక్షణ స్క్రీన్‌ను డియాక్టివేట్ చేయడానికి, నొక్కండి.

వెనుక భాగం వీక్షణను సెట్ చేయడం (ఒకవేళ అమర్చితే)

స్క్రీన్ సెట్టింగ్‌లను మార్చడానికి, వెనుక భాగం వీక్షణ స్క్రీన్ పై నొక్కండి.
  • డిస్‌ప్లే సెట్టింగ్‌లు: కెమెరా స్క్రీన్ యొక్క బ్రైట్నెస్ మరియు కాంట్రాస్ట్‌ను సర్దుబాటు చేయడం.