టచ్ స్క్రీన్‌ను ఉపయోగించడం
మీ సిస్టన్ టచ్ స్క్రీన్‌తో అమర్చబడింది. మీరు టచ్ ఇన్‌పుట్ల ద్వారా అనేక విధులను నిర్వహించవచ్చు.
జాగ్రత్త
- టచ్ స్క్రీన్‌పై అధిక ఒత్తిడిని వర్తింపజేయవద్దు లేదా పాయింటెడ్ ఆబ్జెక్ట్‌తో నొక్కవద్దు. అలా చేస్తే గనుక టచ్ స్క్రీన్‌కి నష్టం కలిగించవచ్చు.
- టచ్ స్క్రీన్‌కు ఎలాంటి ఎలట్రికల్ కండక్టీవ్ మెటీరియల్‌ను తాకనివ్వకండి మరియు వైర్‌లెస్ ఛార్జర్లు లేదా ఎలక్ట్రోనిక్ పరికరాల వంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్‌ని రూపొందించే ఏదైనా ఆబ్జెక్టలను టచ్ స్క్రీన్ దగ్గరలో ఉంచవద్దు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రభావాల వలన సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవచ్చు, ఇది టచ్ స్క్రీన్‌కు నష్టం కలిగించవచ్చు.
గమనిక
మీరు రెగ్యులర్ చేతి తొడుగులు ధరిస్తే, మీరు టచ్ స్క్రీన్‌ను కంట్రోల్ చేయలేరు. మీ చేతి తొడుగులను తీసివేయండి లేదా టచ్ స్క్రీన్‌తో ఉపయోగించడానికి ప్రత్యేకించి డిజైన్ చేసిన చేతి తొడుగులను ధరించండి.
నొక్కండి
ఒక ఆబ్జెక్ట్‌ను నెమ్మదిగా నొక్కి, మీ వేలిని తీసివేయండి. మీరు ఫంక్షన్ను ఉపయోగించవచ్చు లేదా ఎంపికను ఎంచుకోవచ్చు.
నొక్కి, పట్టుకోండి
ఒక ఆబ్జెక్ట్‌ను నొక్కి, మీ వేలిని పైకి తీయకుండా కనీసం ఒక సెకన్ వరకు పట్టుకోండి. మీరు తగిన బటన్‌ను నొక్కి పట్టుకోవడం ద్వారా మీడియాను రివైండ్ లేదా ఫాస్ట్ ఫార్వార్డ్ చేయవచ్చు.
డ్రాగ్ చేయి
ఒక ఆబ్జెక్ట్‌ని నొక్కండి, డ్రాగ్ చేయండి మరియు ఆపై దానిని కొత్త లొకేషన్‌కి డ్రాప్ చేయండి.
స్లయిడే చేయి
మీరు మీడియా ప్లేబ్లాక్ సమయంలో ప్లేబ్యాక్ పొసిషన్‌ను మార్చవచ్చు. ప్లేబ్యాక్ స్క్రీన్‌పై, ప్రొగ్రెస్ బార్‌ను నొక్కి, పట్టుకోండి, ప్రొగ్రెస్ బార్‌తో పాటు మీ వేలిని స్లయిడ్ చేసి, ఆపై మీకు కావల్సిన లొకేషన్‌లో వేలిని పైకెత్తండి.
స్వైప్ చేయి
తగిన దిశలో స్క్రీన్‌ను కొంచెం స్వైప్ చేయండి. మెను లేదా జాబితాను త్వరితంగా స్క్రోల్ చేయడానికి ఇది ఒక సులభమైన మార్గం.