సెట్టింగ్‌లు

సాధారణ సిస్టమ్ సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయడం


సమయం మరియు తేదీ, సిస్టమ్ భాష మరియు మరిన్ని వంటి, మీరు మీ సిస్టమ్ పరిసర వాతావరణ సెట్టింగ్‌లను అనుకూలీకరించవచ్చు.
వాహనం మోడల్ లేదా స్పెసిఫికేషన్లను బట్టి, డిస్‌ప్లే చేసిన స్క్రీన్‌లు మరియు అందుబాటులోని ఎంపికలు భిన్నంగా ఉండవచ్చు.
హోమ్ స్క్రీన్‌పై, అన్ని మెనూలు > సెట్టింగ్‌లు > జనరల్ నొక్కండి మరియు మార్చడానికి ఎంపికను ఎంచుకోండి.

SW సమాచారం/అప్‌డేట్‌ (ఒకవేళ అమర్చితే)

మీరు మీ సిస్టమ్ సంస్కరణ సమాచారాన్ని వీక్షించవచ్చు లేదా తాజా సంస్కరణకు నవీకరించవచ్చు. మీ సిస్టమ్‌ను నవీకరించడానికి, మీ స్థానిక డీలర్‌షిప్‌ను సందర్శించండి.
జాగ్రత్త
  • మొత్తం డేటా అమౌంట్‌ను బట్టి, ఒక నవీకరణకు కొన్ని నిమిషాల సమయం పట్టవచ్చు.
  • నవీకరణ ప్రొగ్రెస్‌లో ఉన్నప్పుడు సిస్టమ్‌ను ఆఫ్ చేయవద్దు లేదా నిల్వ పరికరాన్ని తీసివేయవద్దు. పవర్ సరఫరా కట్ అయినప్పుడు లేదా నిల్వ పరికరం సిస్టమ్ నుండి తీసివేయబడినప్పు, ఇది డేటా నష్టానికి కారణం కావచ్చు లేదా సిస్టమ్ పనిచేయకపోవటానికి కారణం కావచ్చు.

సిస్టమ్ ఇన్‌ఫో

మీరు మీ సిస్టమ్ సమాచారాన్ని చూడవచ్చు.

మెమరీ

మీరు మీ సిస్టమ్ మెమరీ యొక్క నిల్వ సమాచారాన్ని వీక్షించవచ్చు.

మాన్యువల్

మీరు మీ స్మార్ట్‌ఫోన్‌తో QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా సిస్టమ్ వెబ్ మాన్యువల్‌ని యాక్సెస్ చేయవచ్చు.
హెచ్చరిక
QR కోడ్‌ని స్కాన్ చేసే ముందు మీ వాహనాన్ని సురక్షిత ప్రదేశంలో పార్క్ చేయండి. భద్రతా కారణాల దృష్ట్యా, వాహనం కదులుతున్నప్పుడు మీరు సిస్టమ్ స్క్రీన్ నుండి QR కోడ్‌లను యాక్సెస్ చేయలేరు.

డిఫాల్ట్ (ఒకవేళ అమర్చితే)

మీరు మీ సిస్టమ్ సెట్టింగ్‌లను డిఫాఫ్ట్ విలువలకు రీసెట్ చేయవచ్చు. సిస్టమ్‌లో నిల్వ చేసిన మొత్తం వినియోగదారు డేటా కూడా తొలగించబడుతుంది.

బ్లూటూత్ రిమోట్ లాక్

మీరు రిమోట్ అప్లికేషన్‌ల ద్వారా సిస్టమ్‌ను ఆపరేట్ చేయడం నుండి Bluetooth పరికరాలను లాక్ చేయవచ్చు.

తేదీ/సమయం

మీరు ప్రస్తుత సమయం మరియు తేదీని సెట్ చేయవచ్చు లేదా సమయ డిస్‌ప్లే ఫార్మాట్‌ను మార్చవచ్చు.

స్వీయ సమయ సెట్టింగ్

మీరు GPS నుండి సమయ సమాచారాన్ని స్వీకరించడానికి సిస్టమ్‌ను సెట్ చేయవచ్చు. ఈ ఎంపికను మీరు డియాక్టివేట్ చేసినప్పుడు, మీరు సమయం మరియు తేదీని మాన్యువల్‌గా సెట్ చేయవచ్చు.

24 గంటల ఫార్మెట్

మీరు సమయాన్ని 24-గంటల ఫార్మాట్‌లో సెట్ చేయవచ్చు.

భాష/Language

మీరు సిస్టమ్ భాషను మార్చవచ్చు.
గమనిక
  • ఎంచుకున్న భాషను వర్తింపజేయడానికి సిస్టమ్‌కి కొంత సమయం పట్టవచ్చు. మార్పు పూర్తయినప్పుడు, భాష మారినట్టు తెలియజేయడానికి పాప్-అప్ విండో సిస్టమ్ కనబడుతుంది. స్క్రీన్‌పై విండోని మూసివేయడానికి పాప్-అప్ విండో వెలుపల ప్రాంతంలో నొక్కండి లేదా కొన్ని సెకన్లు వేచి ఉండండి.
  • ఈ సెట్టింగ్ MP3 ఫైల్ పేర్ల వంటి, వినియోదారు డేటాపై ప్రభావం చూపదు.

కీబోర్డు

మీరు ప్రతి భాష కోసం కీబోర్డ్ రకాన్ని ఎంచుకోండి.
గమనిక
ఈ సెట్టింగ్ మీ సిస్టమ్‌పై అన్ని టెక్స్ట్ ఇన్‌పుట్లపై వర్తింపజేయబడుతుంది.

ఇంగ్లీష్ కీబోర్డ్ టైపు

మీరు ఇంగ్లీష్ కీబోర్డ్‌ని ఎంచుకోవచ్చు.

కొరియన్ కీబోర్డ్ రకం

మీరు కొరియన్ కీబోర్డ్‌ని ఎంచుకోవచ్చు.

మీడియా సెట్టింగ్‌‌లు (ఒకవేళ అమర్చితే)

మీరు రేడియో లేదా మీడియా ప్లేయర్ కోసం సెట్టింగ్‌లను మార్చవచ్చు.

వాహనం స్టార్ట్ అయినప్పుడు రేడియో/మీడియా ఆఫ్ కావడం

ఇంజిన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు రేడియో లేదా మీడియా ప్లేయర్‌ను ఆఫ్ చేయడం కోసం సిస్టమ్‌ను సెట్ చేయడానికి మీరు ఈ ఎంపికను ప్రారంభించవచ్చు.

వాహనం ఆఫ్ చేయబడినప్పుడు ఆడియో సిస్టమ్ ఆన్‌లో ఉంటుంది (ఒకవేళ అమర్చితే)

వాహనం ఆఫ్ చేయబడిన తర్వాత ఇచ్చిన సమయానికి రేడియో లేదా మీడియా ప్లేయర్ ఆన్‌లో ఉండేలా సెట్ చేయడానికి మీరు ఈ ఎంపికను ప్రారంభించవచ్చు.

మీడియా మార్పు నోటిఫికేషన్‌లు ప్రదర్శించడం (ఒకవేళ అమర్చితే)

మీరు ప్రధాన మీడియా స్క్రీన్‌పై లేనప్పుడు స్క్రీన్ పైభాగంలో మీడియా సమాచారాన్ని క్లుప్తంగా డిస్‌ప్లే చేయడానికి సెట్ చేయవచ్చు. మీరు కంట్రోల్ ప్యానెల్ లేదా స్టీలింగ్ వీల్‌పై ఏవైనా కంట్రోల్‌లను ఉపయోగించడం ద్వారా మీడియా ఐటమ్‌ను మార్చితే, ఈ సెట్టింగ్‌తో ఎలాంటి సంబంధం లేకుండా మీడియా సమాచారం కనబడుతుంది.

డిఫాల్ట్ (ఒకవేళ అమర్చితే)

మీరు మీ సిస్టమ్ సెట్టింగ్‌లను డిఫాఫ్ట్ విలువలకు రీసెట్ చేయవచ్చు. సిస్టమ్‌లో నిల్వ చేసిన మొత్తం వినియోగదారు డేటా కూడా తొలగించబడుతుంది.

Screensaver (ఒకవేళ అమర్చితే)

మీరు కంట్రోల్ ప్యానెల్‌పై పవర్ బటన్‌ను నోక్కి, పట్టుకోవడం ద్వారా స్క్రీన్‌ను ఆఫ్ చేసినప్పుడు డిస్‌ప్లే చేయబడే స్క్రీన్‌సేవర్ ఎంపికను ఎంచుకోవచ్చు.
  • Digital clock: డిజిటల్ గడియారం డిస్‌ప్లే చేయబడింది.
  • Analogue clock: అనలాగ్ గడియారం డిస్‌ప్లే చేయబడింది.
  • None: స్క్రీన్‌సేవర్ ఏదీ డిస్‌ప్లే చేయబడలేదు.