సిస్టమ్ ఓవర్‌వ్యూ

సిస్టమ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడం


సిస్టమ్‌ను ఆన్ లేదా ఆఫ్ ఎలా చేయాలో కింద వివరిస్తుంది.

సిస్టమ్‌ను ఆన్ చేయడం

  1. సిస్టమ్‌ను ఆన్ చేయడానికి, ఇంజిన్‌ను ప్రారంభించండి.
  1. భద్రతా హెచ్చరిక కనిపించినప్పుడు, దాన్ని చదివి నిర్ధారించండి నొక్కండి.
  1. సిస్టమ్ భాషను మార్చడానికి, నొక్కండి భాష/Language.
హెచ్చరిక
  • వాహనం కదులుతున్నప్పుడు భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని ఫంక్షన్లు నిలిపివేయబడవచ్చు. వాహనం ఆగినప్పుడే అవి పనిచేస్తాయి. వాటిలో దేనినైనా ఉపయోగించే ముందు మీ వాహనాన్ని సురక్షితమైన ప్రదేశంలో పార్క్ చేయండి. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వాహనంలో, ఫంక్షన్‌లను ఉపయోగించడానికి పార్కింగ్ బ్రేక్‌ను వాడండి. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వాహనంలో, “P” (పార్క్) కి మారండి లేదా పార్కింగ్ బ్రేక్‌ను వాడండి.
  • సిస్టమ్ తప్పుగా పని చేస్తే, అంటే ఆడియో అవుట్‌పుట్ లేదా డిస్‌ప్లే లేకపోవటం వంటివి ఉంటే, దాన్ని ఉపయోగించడం ఆపివేయండి. సిస్టమ్ తప్పుగా పని చేస్తున్నప్పుడు మీరు దానిని ఉపయోగిస్తూనే ఉంటే, అది అగ్నిప్రమాదం, విద్యుత్ షాక్ లేదా సిస్టమ్ వైఫల్యానికి దారితీయవచ్చు.
జాగ్రత్త
  • కీ ఇగ్నీషన్ స్విచ్ “ACC” లేదా “ON” స్థానంలో ఉంచబడినప్పుడు మీరు సిస్టమ్‌ను ఆన్ చేయవచ్చు. ఇంజిన్ పనిచేయకుండా ఎక్కువ కాలం సిస్టమ్‌ను ఉపయోగించడం వల్ల బ్యాటరీ పాడవుతుంది. మీరు సిస్టమ్‌ను ఎక్కువ కాలం ఉపయోగించాలని భావిస్తే, ఇంజిన్‌ను ప్రారంభించండి.
  • మీరు ఇంజిన్‌ను ప్రారంభించకుండా మీ సిస్టమ్‌ను ఆన్ చేస్తే, బ్యాటరీ హెచ్చరిక కనిపిస్తుంది. ఇంజిన్ ప్రారంభించిన తర్వాత, బ్యాటరీ హెచ్చరిక అదృశ్యమవుతుంది.
గమనిక
  • మీరు ఇంజిన్‌ను ప్రారంభించినప్పుడు ఎక్కువ వాల్యూమ్‌లో ఆడియోను ప్లే చేయడాన్ని నివారించడానికి, ఇంజిన్‌ను ఆపడానికి ముందు వాల్యూమ్ స్థాయిని సర్దుబాటు చేయండి. మీరు వాల్యూమ్ స్థాయిని స్వయంచాలకంగా తగ్గించడానికి సిస్టమ్‌ను కూడా సెట్ చేయవచ్చు. హోమ్ స్క్రీన్‌పై, అన్ని మెనూలు > సెట్టింగ్‌లు > సౌండ్ > ప్రాధాన్యత, సిస్టమ్ వాల్యూంలు లేదా ప్రీమియం సౌండ్ను నొక్కండి మరియు స్టార్ట్-అప్‌లో వాల్యూం పరిమితి ఎంపికను సక్రియపరచండి.
  • ఇంతకు మునుపు నిర్దిష్ట స్థాయి కంటే ఎక్కువగా సెట్ చేయబడి ఉంటే, ప్రారంభంలో ఆడియో వాల్యూమ్‌ను స్వయంచాలకంగా తగ్గించడం కోసం సిస్టమ్‌ను సెట్ చేయడానికి మీరు ఈ ఎంపికను ఎంచుకోవచ్చు.

సిస్టమ్‌ను ఆఫ్ చేయటం

ఒకవేళ మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సిస్టమ్ని ఉపయోగించకూడదు అనుకుంటే, మీరు కంట్రోల్ ప్యానెల్పై పవర్ బటన్ను నొక్కి, పట్టి ఉంచడం ద్వారా సిస్టమ్ని ఆఫ్ చేయవచ్చు.
  • స్క్రీన్ మరియు సౌండ్ ఆఫ్ అవుతుంది.
  • సిస్టమ్‌ను మళ్లీ ఉపయోగించడానికి, పవర్ బటన్‌ను నొక్కండి.
మీరు ఇంజిన్‌ను ఆఫ్ చేసిన తర్వాత, కొంత సమయం తర్వాత లేదా మీరు డ్రైవర్ డోర్ తెరిచిన వెంటనే సిస్టమ్ స్వయంచాలకంగా ఆఫ్ అవుతుంది.
  • వాహనం మోడల్ లేదా స్పెసిఫికేషన్లను బట్టి, మీరు ఇంజిన్‌ను ఆఫ్ చేసిన వెంటనే సిస్టమ్ ఆఫ్ కావచ్చు.